Home  »  TV News  »  Ye Devi Varamo Neevu : తాతయ్య ఇంట్లోనే అంజలి.. మనీష్‌కి ఊహించని షాక్!

Updated : Jul 23, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'(Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -15 లో...... హైదరాబాద్ వరకు వచ్చిన అమ్మాయి ఎలా మిస్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎలా తన అడ్రెస్ దొరుకుతుందని రాజారావు టెన్షన్ పడుతాడు. అప్పుడే అంజలి తన ఇంటి ముందుకి వస్తుంది. సెక్యూరిటీ తనని ఆపుతాడు. ప్లీజ్ అన్న ఒకసారి సర్ కి ఫోన్ చెయ్యండి. కలవను అంటే వెళ్ళిపోతానని అంజలి అనగానే సెక్యూరిటీ రాజారావుకి ఫోన్ చేస్తాడు. ఎవరో వైజాగ్ నుంచి అంజలి అంట అని చెప్పగానే త్వరగా పంపించమని రాజారావు చెప్తాడు. అంజలి లోపలికి వెళ్తుంది. అక్కడ రాజారావు మనవరాలు ఇంకా అతని భార్య ఉంటారు. వాళ్ళని పైకి వెళ్ళమని రాజారావు చెప్తాడు.

దాంతో అంజలి డైరెక్ట్ రాజారావు దగ్గరికి వెళ్తుంది. తనని చూసి రాజారావు ఎమోషనల్ అవుతాడు. జానకమ్మకి అల అవ్వడం బాధాకరమని రాజారావు అంటాడు. అమ్మ వెళ్ళిపోతు మీ గురించి చెప్పిందనగానే రాజారావు టెన్షన్ పడుతూ ఏం చెప్పిందని అంటాడు. అడ్రెస్ ఇచ్చి మిమ్మల్ని కల్వమంది మిమ్మల్ని కలిస్తే మా అమ్మానాన్న గురించి తెలుస్తుందని చెప్పింది. ప్లీజ్ తాతయ్య మా అమ్మ గురించి చెప్పండి అని అంజలి రిక్వెస్ట్ చేస్తుంది. తన కాళ్ళు పట్టుకొని మరి అడుగుతుంది. నాకు మతిమరుపు వచ్చింది అమ్మ మర్చిపోయాను.. గుర్తువచ్చినప్పుడు చెప్తాను ..కాదు చూపిస్తానని రాజారావు అనగానే సరే తాతయ్య రోజు మీ దగ్గరికి వస్తానని తన బ్యాగ్ పట్టుకొని వెళ్తుంటే ఎక్కడికి అని రాజారావు అడుగుతాడు.

అనాధాశ్రమానికి అని అంజలి అనగానే ఈ తాతయ్య ఉండగా నువ్వు అలా వెళ్ళడానికి వీలులేదని రాజారావు అనగానే అంజలి షాక్ అవుతుంది. అంటే తాతయ్య అని పిలుస్తున్నావ్ కదా.. ఈ తాతయ్య ఉండగా నువ్వు బయటకు ఎందుకు అమ్మ అని రాజారావు అంటాడు. తరువాయి భాగంలో అంజలి చేసిన గొడవ వళ్ళ నా వైజాగ్ ఇని స్టిట్యూట్ పర్మిషన్ క్యాన్సిల్ అయిందని అంజలిపై గీతాంజలి కోపంగా ఉంటుంది. మరొకవైపు నా గురించి వెతకొద్దని  మనిష్ ని అంజలి గేట్ బయటకు పంపిస్తుంది. నా ఇంట్లో నుంచి నన్ను గెంటేస్తుందని మనీష్ ఆశ్చర్యంగా చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.